జెడ్పీ చైర్మన్ స్థానాలన్నింటినీ కైవసం చేసుకుంటాం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్

Wed,April 24, 2019 09:04 PM

all zp chairman seats will be won by trs assures minister srinivas goud

మహబూబ్‌నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రాష్ట్రంలోని జెడ్పీ చైర్మన్ స్థానాలన్నింటినీ కైవసం చేసుకుంటామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. భూత్పూరు మండల కేంద్రంలో టీఆర్‌ఎస్ పార్టీ తరపున జెడ్పీటీసీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే స్వర్ణ సుధాకర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో పాటు పాలమూరు లోక్‌సభ టీఆర్‌ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి, శాట్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో టీఆర్‌ఎస్ దాదాపుగా అన్ని స్థానాలను కైవసం చేసుకుందని, పార్లమెంట్ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థులను ఓటర్లు ఆదరించారని గుర్తు చేశారు. రానున్న ప్రాదేశిక ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ మహబూబ్‌నగర్ జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నేత స్వర్ణ సుధాకర్‌రెడ్డిని అధిష్టానం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. టిక్కెట్ ఆశించిన వారికి పార్టీ న్యాయం చేస్తుందన్నారు.

స్వర్ణ సుధాకర్‌రెడ్డి గెలుపునకు పార్టీ నేతలు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. గతంలో ఎప్పుడూ లేనంతగా టీఆర్‌ఎస్ టిక్కెట్ల కోసం పోటీ నెలకొన్నదన్నారు. ఆశావహులు ఎందరో ఉన్నారని, అన్ని సమీకరణాలు చూసే అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు. పార్టీకి విధేయులుగా ఉన్న వారికి తగిన న్యాయం జరుగుతుందన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న కర్వెన రిజర్వాయర్ పనులు ఆలస్యమయ్యేందుకు కాంగ్రెస్ నేతలు కారణమన్నారు.

ప్రస్తుతం 60 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయని, మరో రెండేళ్లలో పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్‌నగర్‌కు వచ్చి హామీ ఇచ్చిన మేరకు రూ.18 వేల కోట్లు మంజూరయ్యాయని అన్నారు. ఎన్నికల కోడ్ తొలగిన తర్వాత ఆ నిధులు విడుదలై పాలమూరు ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతాయన్నారు.

1753
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles