నిమజ్జనానికి పకడ్బందీ చర్యలు: ఎస్పీ మల్లా రెడ్డి

Fri,September 21, 2018 05:17 PM

All arrangements were done about ganesh immersion says Asifabad SP

ఆసిఫాబాద్: జిల్లాలో జరుగబోయే గణేశ్ నిమర్జనమునకు పకడ్బందీ చర్యలను చేపట్టామని జిల్లా ఎస్పీ మల్లారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆసిఫాబాద్ పట్టణంలో శోభాయాత్ర వెళ్ళే మార్గంను, భద్రత కోసం అమర్చబడిన సీసీ కెమెరాల పనితీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్బముగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు వారి యొక్క సూచనలకు అనుగుణముగా నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులు నడుచుకొని ప్రశాంతముగా నిమజ్జనం పూర్తి అయ్యేలా సహాయ సహకారాలు అందించాలని కోరారు. భద్రత పరమైన అన్ని చర్యలను చేపట్టామని, అవసరమైన ప్రాంతాలలో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశామన్నారు. శోభాయాత్ర వెళ్ళేమార్గంలో సైతం ఇతర శాఖల సమన్వయముతో చర్యలను తీసుకున్నామని తెలిపారు.

ఊరేగింపు, నిమజ్జనానికి సంబంధించిన సూచనలు :

1. నిమజ్జనం/ శోభా యాత్ర కొరకై ఏర్పాటు చేసే వాహనాలు మంచి కండిషన్ లో వున్నవి మాత్రమే వాడవలెను.
2. స్థానిక పోలీస్ అధికారులు ఇచ్చిన సీరియల్ నెంబర్ వాహనానికి ముందు కనిపించే విధంగా అతికించేవలెను. గణేష్ మండపాలు యొక్క పూర్తి వివరాలు నిమజ్జనం కొరకు ఎక్కడికి ఏ మార్గం ద్వారా తీసుకున్నారని సమాచారం సంబంధిత పోలీస్ స్టేషన్ లోని అధికారులకు ముందుగానే తెలుపవలెను.
3.వాహనములలో కట్టెలు, కత్తులు, ఇంధనములు,పేలుడు పదార్థాలు ఇతర ఆయుధాలను తీసుకెళ్ళరాదు.
4. ఊరేగింపు సమయంలో బాణాసంచాలు కాల్చరాదు.
5. ఊరేగింపులో ఎర్ర రంగు కుంకుమ, పసుపు మొదలైన రంగులను దారినపోయే వారిపై చల్లరాదు.
6. ఊరేగింపు వాహనంలోకి అపరిచితులను అనుమతించరాదు. డీజేలను ఉపయోగించరాదు.
7. మద్యం సేవించి ఊరేగింపులో పాల్గొనరాదు. ట్రాఫిక్ కు ఎట్టి పరిస్థితులలో ఇబ్బంది కలిగించరాదు.

2502
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles