మక్కామసీదు పేలుళ్ల కేసును కొట్టేసిన నాంపల్లి కోర్టు

Mon,April 16, 2018 12:10 PM

All accused in Mecca Masjid blast case have been acquitted by Namapally Court

హైదరాబాద్ : మక్కా మసీదు పేలుళ్ల కేసును నాంపల్లి ఎన్‌ఐఏ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో నిందితులైన స్వామి అసీమానంద, దేవేందర్ గుప్తా, రాజేందర్ చౌదరి, లోకేశ్ శర్మ, భరత్ భాయిని భారీ బందోబస్తు మధ్య చర్లపల్లి జైలు నుంచి ఇవాళ ఉదయం నాంపల్లి కోర్టుకు తీసుకువచ్చి హాజరుపరిచారు. అనంతరం వాదనలు విన్న న్యాయమూర్తి.. ఆధారాలు లేనందున ఈ కేసును కొట్టివేస్తున్నట్లు తీర్పు వెల్లడించారు. స్వామి అసీమానంద, దేవేందర్ గుప్తా, రాజేందర్ చౌదరి, లోకేశ్ శర్మ, భరత్ భాయి ని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. కేసు తీర్పు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.
మొత్తం పది మంది నిందితుల్లో ఐదుగురిపై విచారణ పూర్తి కాగా, మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. పరారీలో సందీప్ వి డాంగే, రాంచందర్ కల్సంగర్, అమిత్ చౌహన్ ఉన్నారు. తేజ్‌రామ్ పార్మార్‌పై విచారణ కొనసాగుతుంది. సునీల్ జోషీ అనే నిందితుడు హత్యకు గురయ్యాడు.

కేసు పూర్వపరాలు..
2007 మే 18వ తేదీన మధ్యాహ్నం 1.18 గంటలకు హైదరాబాద్‌లోని మక్కా మసీద్‌లో పేలుడు సంభవించింది. ఆ సమయంలో వందల మంది ప్రార్థనలు చేస్తున్నారు. పేలుడు తీవ్రతకు 14 మంది మరణించగా, 58 మంది తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన రంగంలోకి దిగిన హైదరాబాద్ పోలీసులు కేసు దర్యాప్తునకు ప్రత్యేకంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)ను ఏర్పాటు చేశారు. విధ్వంసకారులు మూడు ఐఈడీ బాంబులను అమర్చినట్టు సిట్ గుర్తించింది. వాటిలో ఒక దాన్ని టైమర్‌తో పేల్చగా, మరో రెండు పేలని బాంబులను నిర్వీర్యం చేశారు. పేలిన బాంబును బరువైన బండరాయి కింద పెట్టడంతో ప్రాణనష్టం పెద్దగా జరుగలేదని పోలీస్ అధికారులు తెలిపారు. కేసు విచారణలో పురోగతి లేకపోవడంతో 2010లో సీబీఐకి అప్పగించారు. సీబీఐ లోతైన దర్యాప్తు జరిపి దేవేందర్ గుప్తా, లోకేశ్‌శర్మను సూత్రధారులుగా గుర్తించి, మరికొందరి పేర్లు జత చేస్తూ చార్జిషీట్ దాఖలు చేసింది. 2011 మే లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కేసును విచారణకు స్వీకరించి.. 10 మంది నిందితుల పేర్లతో చార్జిషీట్ దాఖలు చేసింది.

3510
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles