కాంగ్రెస్‌కు మరో షాక్.. ఆలేరు మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్య రాజీనామా

Sun,March 24, 2019 08:13 PM

aler former mla bixamaiah to join in trs party soon

హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆలేరు మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన టీఆర్‌ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తను రెండు సార్లు ఓడిపోవడానికి కోమటిరెడ్డి సోదరులే కారణమని బిక్షమయ్య వెల్లడించారు. పార్టీలో బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని ఆయన తెలిపారు. తన అనుచరులతో కలిసి త్వరలో టీఆర్‌ఎస్‌లో చేరుతానన్నారు. సీఎం కేసీఆర్ పాలనకు ఆకర్షితుడినై టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు ఆయన ప్రకటించారు.

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.

4233
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles