మద్యం తాగి సైకో వీరంగం

Fri,July 19, 2019 09:35 PM

Alcoholic Drink Psycho attack on man at palwancha

పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో ఓ సైకో వీరంగం సృష్టించాడు.. దారి వెంట వెళ్తున్న వారిని కత్తి పట్టుకుని బెదిరించాడు. పాల్వంచ కేటీపీఎస్‌లో ఆర్జీజన్‌గా పనిచేస్తున్న సమ్మిడి మురళీకృష్ణపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దుల నగేష్ అనే యువకుడు పాల్వంచలోని నటరాజ్‌కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇటీవల మద్యానికి బానిసై అనేకసార్లు రోడ్లకు అడ్డంగా పడుకోవడం, సెల్ టవర్లు ఎక్కడం, ట్రాన్స్‌ఫార్మర్లలో చేతులు పెట్టడం లాంటి విచిత్ర పనులకు పాల్పడేవాడు. పోలీసులు అనేకసార్లు స్టేషన్‌కు పిలిపించి మందలించినా ప్రవర్తన మార్చుకోలేదు. ఈ క్రమంలో కుటంబ సభ్యులు కూడా యువకుడిని ఇంటికి రానివడం లేదు. మద్యం తాగి రోడ్డుపై వెళ్తున్న కేటీపీఎస్ ఆర్టీజన్ మురళీకృష్ణపై కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాల పాలైన మురళీకృష్ణ పాల్వంచలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందాడు. అనంతరం వైద్యుల సలహా మేరకు కొత్తగూడెంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. సైకో విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని నటరాజ్ సెంటర్‌లో పట్టుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సైకో ఉద్యోగిపై కావాలనే ఈ దాడికి పాల్పడినట్లు ఎస్సై ముత్యం రమేష్ తెలిపారు. నిందితుడిపై 307 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చారు.

881
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles