ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఐజ విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే అబ్రహం

Fri,April 19, 2019 07:05 PM

alampur mla abraham congratulates intermediate students

జోగులాంబ గద్వాల: ఇంటర్‌ ఫలితాల్లో జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహం అభినందించారు. గురువారం విడుదల చేసిన ఇంటర్‌ ఫలితాల్లో జిల్లాలోని ఐజ మండ‌ల కేంద్రంలోని హరిహర జూనియర్‌ కళాశాల విద్యార్థులు జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచారు.

భవిష్యత్‌లో ఉన్నత చదువులు చదవాలని రాష్ట్రస్థాయిలోనే కాక జాతీయ స్థాయిలో జిల్లా పేరును నిలబెట్టాలని ఎమ్మెల్యే కోరారు. విద్యార్థులు ఉన్నత చదువులతోనే జాతీయస్థాయికి ఎదిగేందుకు అవకాశాలు ఉన్నాయని వివరించారు. తమపై తల్లిదండ్రులు, అధ్యాపకులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకూడదని పేర్కొన్నారు. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా వీలైనంత సేపు సమాజసేవ చేయాలని ఎమ్మెల్యే కోరారు.

టాప‌ర్లు వీరే..

ఇంటర్ ద్వితియ సంవత్సరం ఎంపీసీ గ్రూప్‌లో వెయ్యి మార్కులకు గాను జీ హర్షప్రియ 983 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. సీఈసీ గ్రూప్‌లో ఎండీ హస్నహుమేరా 927 మార్కులు సాధించి మండలంలో మొదటి స్థానంలో నిలిచింది. ఇంటర్ మొదటి సంవత్సరంలో సీఈసీ గ్రూప్‌కు చెందిన టి. సాయిశృతి 500 మార్కులకు 477 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది.

1159
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles