Telangana Intermediate 1st & 2nd Year Results 2019

కేరళ వరద బాధితులకు అక్షయపాత్ర అపాన్న హస్తం

Fri,August 17, 2018 10:31 PM

Akshaya Patra opaque holders for Kerala flood victims

హైదరాబాద్ : కేరళ వరద బాధితుల ఆకలిని తీర్చడానికి అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా సహాయం అందిస్తున్నట్లు ఆ ఫౌండేషన్ అధ్యక్షుడు సత్యగౌరచంద్ర దాస్ తెలిపారు. గతవారం నుంచి కనీవినీ ఎరుగని వానలు, వరదలతో కేరళ రాష్ట్రం అతలాకుతలమైందని, పునరావాస కేంద్రాల్లో అనేక మందికి సరైన ఆహారం అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా సత్వరమే వరద బాధితుల ఆకలిని తీరుస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దేశంలో వరద లేదా భూకంపం లాంటి ప్రకృతి వైపరీత్యాలలో బాధిత ప్రజలకు సకాలంలో ఆహారం అందించిన అక్షయపాత్ర సేవలను స్వామిజీ గుర్తు చేశారు.

కేరళలోని 14 జిల్లాల్లో 13 జిల్లాల్లో హై అలర్ట్ హెచ్చరికలు కొనసాగుతుండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నదని ఆయన తెలిపారు. అక్కడి స్థానికులు దేశం నుంచి సహాయం కోసం ఎదిరి చూస్తున్న సమయంలో అక్షయపాత్ర ఫౌండేషన్ ఎన్నో వ్యయప్రయాసాలతో వేడిగా ఉడికించిన భోజనాన్ని వరద బాధిత ప్రాంతాల్లో అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. తమ ఫౌండేషన్ ద్వారా కేరళలోని ఏడుతువు, అలపూజ జిల్లాల్లో కొంత మంది సిబ్బందితో ఈ నెల 13వ తేదీ నుంచి ఆహారాన్ని పంపిణీ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వరదలు తగ్గి జనజీవనం సాధారణ స్థితికి వచ్చే వరకు ఈ సహాయక చర్యలు చేపడుతామని ఆయన స్పష్టం చేశారు.

1776
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles