కొత్తగూడెం-భద్రాచలం మధ్య విమానాశ్రయం

Wed,September 13, 2017 09:36 PM

Airport between Kothagudem and Bhadrachalam

హైదరాబాద్: కొత్తగూడెం-భద్రాచలం మధ్య విమానాశ్రయం నిర్మాణం జరగాలని సీఎం కేసీఆర్ అన్నారు. యాదాద్రి, భద్రాద్రి దేవాలయాల అభివృద్ధిపై బుధవారం సీఎం సమీక్ష చేపట్టారు. ఈ సమావేశంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఆలయాల అభివృద్ధి నమూనాలను సీఎం, మంత్రులు పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. భద్రాద్రిని అద్భుత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలన్నారు. భద్రాద్రికి ఎంతో స్థల మహాత్యం, పౌరణిక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉందని తెలిపారు. ఆలయం ప్రాంగణంలోనే కళ్యాణ మండపం, షాపింగ్ కాంప్లెక్స్, భక్తుల విశ్రాంతి గదులు నిర్మించాలని సూచించారు. గర్భగుడి ఇతర ప్రధాన కట్టడాలకు ఆటంకం లేకుండా నిర్మాణాలు చేపట్టాలన్నారు. కొత్తగూడెం రైలుమార్గాన్ని భద్రాచలం వరకు పొడిగించాలని కేంద్రానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు.

1575
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles