రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధి బాగుంది: జగ్గీవాసుదేవ్Wed,September 13, 2017 07:23 PM
రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధి బాగుంది: జగ్గీవాసుదేవ్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధి బాగుందని సద్గురు జగ్గీవాసుదేవ్ అన్నారు. హైదరాబాద్‌లో ర్యాలీ ఫర్ రివర్స్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జగ్గీవాసుదేవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో చెట్ల పెంపకం, చెరువుల మరమ్మతులకు ప్రభుత్వం చేస్తున్న కృషి బాగుందన్నారు. ఈ కార్యక్రమాలతో వచ్చే ఐదేళ్లలో అద్భుతమైన ఫలితాలు లభిస్తాయన్నారు. నగరం నుంచి రోజుకు వందకోట్ల లీటర్ల వాడిన నీరు బయటికి వెళ్తోందని.. ఉపయోగించిన నీరు వృథా కాకుండా తిరిగి వినియోగంలోకి తేవాలని సూచించారు. నదుల రక్షణ-భారత సంరక్షణ అనే నినాదంతో దేశవ్యాప్తంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందరూ నదుల రక్షణకు కృషి చేయాలని కోరారు.

1145
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Union Budget 2018