ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగానికి వయోపరిమితి సడలింపుWed,September 13, 2017 06:17 PM
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగానికి వయోపరిమితి సడలింపు


హైదరాబాద్ : ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ (ఎఫ్ఆర్ఓ) ఉద్యోగం కోసం దరఖాస్తు చేసే అభ్యర్థుల వయో పరిమితిని మూడు సంవత్సరాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. 28 సంవత్సరాల వయస్సు నిర్ణయం వల్ల తాము ఎఫ్ఆర్ఓ ఉద్యోగానికి దరఖాస్తు చేయలేక పోతున్నామని అటవీ శాఖ మంత్రి జోగు రామన్నను కలిసి నిరుద్యోగ అభ్యర్థులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ విషయాన్ని మంత్రి జోగు రామన్న సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం వయో పరిమితిని 28 నుంచి 31 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

4897
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS