'అథ్లెటిక్స్' చాంప్ ఆదిలాబాద్

Tue,January 29, 2019 10:05 AM

Adilabad is the Athletics champion

నిజామాబాద్ : రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ఆదిలాబాద్ జిల్లా చాంపియన్‌గా నిలిచింది. జిల్లా కేంద్రం నాగారంలోని రాజారాం స్టేడియంలో జరిగిన అథ్లెటిక్స్ పోటీలు సోమవారం అట్టహాసంగా ముగిశాయి. అండర్-10, 12, 14, 18 వయో పరిమితుల్లో బాలబాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ క్రీడా పాఠశాలల్లో శిక్షణ పొందుతున్న వారితో పాటు గ్రామీణ ప్రాంత క్రీడాకారులు ఈ టోర్నీలో ప్రతిభ చాటారు. అంతర్జాతీయ ప్రమాణాలతో హైజంప్, హార్డిల్స్, రిలే వంటి వివిధ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లు క్రీడాభిమానులను కనువిందు చేశాయి. అత్యధిక పతకాలు సాధించిన ఆదిలాబాద్ 102 పాయింట్ల ఆధిక్యంతో ఓవరాల్ చాంపియన్‌షిప్‌తో నంబర్‌వన్ స్థానంలో నిలిచింది. అండర్-10 బాలుర విభాగంలో నాగర్‌కర్నూల్ 16 పాయింట్లతో టీమ్ చాంపియన్‌షిప్ సాధించింది.

అండర్-12 విభాగంలో 33 పాయింట్లతో ఆదిలాబాద్, అండర్-14లో 16 పాయింట్లతో హైదరాబాద్, అండర్-10 బాలికల విభాగంలో 36 పాయింట్ల ఆధిక్యంతో ఆదిలాబాద్ టీం చాంపియన్‌షిప్ సాధించాయి. రాష్ట్ర వ్యాప్తంగా 27 జిల్లాల నుంచి పాల్గొన్న ఈ క్రీడాపోటీల్లో విజేతలకు టీఎన్‌జీవోస్ జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్ ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు, ప్రశంసా పత్రాలు, ట్రోఫీలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రీడలకు మహర్దశ వచ్చిందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అథ్లెటిక్స్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు బీఈ స్టాలిన్ జోన్స్, ప్రధాన కార్యదర్శి సారంగపాణి, టోర్నీ పరిశీలకుడు వెంకటేశ్వర్‌రెడ్డి, జిల్లా సంఘం అధ్యక్షుడు రత్నాకర్, ఉపాధ్యక్షులు వైఆర్ డేవిడ్, మార్టిన్, ప్రధాన కార్యదర్శి రాజగౌడ్, టీఎన్‌జీవోస్ జిల్లా కార్యదర్శి అమృత్ కుమార్, క్రీడాకారులు, కోచ్‌లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

367
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles