తనిఖీల్లో పట్టుబడ్డ హవాలా డబ్బుపై విచారణ జరుగుతోంది: జితేంద‌ర్‌

Thu,December 6, 2018 06:49 PM

Additional DGP Jitendra press meet ahead of telangana elections

హైదరాబాద్: తెలంగాణలో రేపు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అడిషనల్ డీజీపీ జితేంద‌ర్‌ మీడియాతో మాట్లాడారు. రేపు నిర్వహించే పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశాం. పోలింగ్‌కు అవసరమైన భద్రత ఏర్పాట్లు చేశాం. అన్ని ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేశాం. ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరుగుతాయి. తనిఖీల్లో రూ.93 కోట్ల నగదు సీజ్ చేశాం. హైదరాబాద్‌లో నిన్న రూ.40 లక్షల నగదు పట్టుబడింది.

కూకట్‌పల్లిలో రూ.17 లక్షలు సీజ్ చేశాం. ఇప్పటి వరకు 4 లక్షల లీటర్లకు పైగా మద్యం పట్టుకున్నాం. ఇవాళ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాం. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి అల్లర్లు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేశాం. పోటీలో ఉన్న అభ్యర్థులు కొందరిపై నియమాల ఉల్లంఘన కేసులు ఉన్నాయి. తనిఖీల్లో పట్టుబడిన హవాలా డబ్బుపై విచారణ కొనసాగుతోంది. ఎన్నికల ప్రక్రియలో కొందరు పోలీసు అధికారులపై ఫిర్యాదులు అందాయి. పోలీసు అధికారులపై అందిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాం. ఆ పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని.. ఆయన స్పష్టం చేశారు.

2312
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles