వైల్డ్ లైఫ్ ఫిలిం ఫెస్టివల్‌కు ఇంద్రకరణ్‌రెడ్డిని ఆహ్వానించిన అమల

Sat,March 2, 2019 05:08 PM

actress amala invites minister indrakaran reddy for wildlife film festival

హైద‌రాబాద్: వన్యప్రాణులు, అట‌వీ సంరక్షణకు తెలంగాణ ప్ర‌భుత్వం చేస్తున్న కృషిని బ్లూ క్రాస్ సంస్థ వ్యవస్థాపకురాలు, ప్రముఖ నటీమణి అక్కినేని అమల ప్ర‌శంసించారు. నగరంలోని అన్న‌పూర్ణ స్టూడియోలో ఈ నెల 8 నుంచి 10వ తేది వ‌ర‌కు జ‌రిగే ఇంట‌ర్నేష‌న‌ల్ వైల్డ్ లైఫ్ ఫిలిం ఫెస్టివ‌ల్ కు రావాలంటూ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డిని అమల ఆహ్వానించారు.

ఈ సంద‌ర్బంగా ఆమె మాట్లాడుతూ.. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటడం, వన్యప్రాణుల పరిరక్షణకు సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను కొనియాడారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల నుంచి పెద్దపులులు ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా పరిసర ప్రాంతాల్లోని అడవులకు వలస వస్తున్నాయని, వాటి సంర‌క్ష‌ణ‌కు మ‌రిన్ని చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. ఈ సంద‌ర్బంగా హైటికోస్ సంస్థ ఆద్వ‌ర్యంలో పులుల సంర‌క్ష‌ణ‌కు తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను ఆమె మంత్రికి వివ‌రించారు.

833
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles