బరువెక్కిన గుండె... కాని కర్తవ్యానికే ఓటు...

Thu,December 6, 2018 10:04 PM

acp bhujanga rao commit his election duty

హైదరాబాద్ : తండ్రి మృతి చెందిన భారం ఒక వైపు....కర్తవ్యం ఒక వైపు...ఈ పరిస్థితి ఎదుర్కున్న ఓ పోలీసు అధికారి కర్తవ్యానికే కంకణ బద్ధుడైయ్యాడు. మనస్సులో భారాన్ని పక్కన పెట్టి పోలీసు విధులే కీలకంగా భావించి ఎలక్షన్ డ్యూటీ చేస్తున్నారు.అతని విధి నిర్వహణ ఇప్పుడు అందరీకి ఆదర్శంగా మారింది. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ ఎలక్షన్ సెల్ విధులు నిర్వహిస్తున్న ఏసీపీ భుజంగరావు తండ్రి మూడు రోజుల కిందట అనారోగ్యంతో మృతిచెందారు. ఈ సంఘటనతో శోక భారంలో మునిగిన భుజంగరావు అంత్యక్రియలకు హాజరైయ్యారు. రెండు రోజుల తర్వాత తిరిగి ఆయన ఉద్యోగంలో చేరి ఎలక్షన్ సెల్‌ను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ విధంగా భుజంగరావు బాధ్యతను మరువకుండా తనకు అప్పగించిన విధులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు దు:ఖాన్ని పక్కన పెట్టి ఎన్నికల పోలింగ్‌ను ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు తన వంతు సహాకారాన్ని అందిస్తున్నారు. ఇలాంటి సందర్భాలు మనం చాలా వరకు సినిమా దృశ్యాల్లో చూస్తాం. ఆ సీన్‌లను చూసినప్పుడు అందరూ భావోద్వేగానికి గురవుతాం.కాని రియల్‌గా ఈ దృశ్యం కనపడినప్పుడు ప్రతి ఒక్కరు సార్ గ్రేట్ అంటూ చర్చించుకుంటున్నారు.

2696
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles