భార్యను హత్యచేసిన కేసులో నిందితుడు అరెస్టు

Tue,March 6, 2018 05:57 AM

accused has been arrested in his wife murder case

హైదరాబాద్ : భార్యపై అనుమానంతో అతికిరాతకంగా హత్యచేసిన నిందితుడిని చిక్కడపల్లి పోలీసులు అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ భీంరెడ్డి కథనం ప్రకారం.. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం, మంతెనగౌడ్ గ్రామానికి చెందిన మొగలప్ప (50) అలియాస్ మోహన్, బోనమ్మ అలియాస్ భవానీ దంపతులు. వీరు అశోక్‌నగర్ శ్రీ సాయి లక్ష్మీనర్సింహ ఎన్‌క్లేవ్‌లో ఉంటూ, మోహన్ వాచ్‌మెన్‌గా పనిచేసేవాడు. మొగలప్పకు భార్యపై అనుమానం ఉండేది.

ఈ విషయంపై తరుచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో గత నెల 24న మద్యం మత్తులో మొగలయ్య భార్యతో గొడవపడి... ఆమెను కత్తితో పొడిచి హత్య చేసి పరారయ్యాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు బషీరాబాద్ మండలంలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఎస్సై పచ్చు బాల్‌రాజ్, సిబ్బంది వీర శేఖర్, సంపత్‌లు అక్కడికి వెళ్లి సాయంత్రం నిందితుడిని అదుపులోకి తీసుకుని నగరానికి తీసుకొచ్చారు. విచారణలో తన భార్య మరో వ్యక్తితో చనువుగా ఉంటుందనే కోపంతోనే హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

2072
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS