పోలీసుల అదుపులో ప్రణయ్ హత్య కేసు నిందితులు!

Sat,September 15, 2018 11:32 AM

హైదరాబాద్ : ప్రేమ వివాహం చేసుకున్న యువకుడు తన భార్య అమృత కళ్లెదుటే దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో ఏ1 నిందితుడు మారుతీరావు(అమృత తండ్రి), ఏ2 నిందితుడు శ్రవణ్ కుమార్(అమృత బాబాయ్).. గోల్కొండ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ప్రణయ్ హత్యకు నిరసనగా మిర్యాలగూడలో ఎస్సీ సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చి ఆందోళన చేపట్టాయి. మారుతీరావు కుటుంబంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మృతుడి కుటుంబానికి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ సంఘీభావం తెలిపారు. ప్రణయ్ కుటుంబాన్ని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్‌రావు పరామర్శించారు.

8890
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles