అమరావతి: ఆదాయానికి మించి ఆస్తులున్న కేసులో సస్పెండైన ఏపీలోని కర్నూలు జిల్లా, సంజామల తాసిల్దార్ గోవింద్‌సింగ్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. రూ.5 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన అతని ఇంట్లో గతంలోనే ఆకస్మిక తనిఖీలు చేసిన ఏసీబీ అధికారులు విలువైన స్థిర, చరాస్తులను గుర్తించగా, అతన్ని జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు అధికారులు మంగళవారం మరోమారు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించగా నాలుగు ఇండ్ల స్థలాల పత్రాలు, 43.50 లక్షల నగదు, 450 గ్రాముల బంగారు ఆభరణాలు, 1.09 కోట్ల బ్యాంకు డిపాజిట్లు, 13 లక్షలు విలువచేసే బాండ్లు, కారు, ద్విచక్రవాహనాలను గుర్తించారు. 10 కోట్ల ఆస్తులు బయటపడినట్టు అధికారులు తెలిపారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్న అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.