ఏసీబీకి చిక్కిన వీఆర్‌ఏ

Mon,March 25, 2019 09:14 PM

ACB officials arrested VRA in bribe case

పెద్దకొత్తపల్లి: భూమి పాసు బుక్కు కోసం రైతు నుంచి రూ.5వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టబడ్డాడు. నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మారెడుమాన్‌దిన్నె గ్రామానికి చెందిన సొప్పరి నర్సింహకు చెందిన సర్వే నెంబర్ 126/7 భూమి పాసు బుక్కు కోసం అదే గ్రామానికి చెందిన వీఆర్‌ఏ శ్రీధర్ రూ.5వేలు లంచం డిమాండ్ చేయగా నర్సింహ ఈనెల 18న మహబూబ్‌నగర్‌లో ఏసీబీ అధికారులను కలిసి ఫిర్యాదు చేశాడు. పక్కా ప్రణాళికతో పెద్దకొత్తపల్లి బస్టాండ్ సమీపంలో నర్సింహ నుంచి రూ.5వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణ గౌడ్ పట్టుకొని నగదు స్వాధీనం చేసుకొన్నారు.

3124
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles