ఆంధ్రజ్యోతి కథనాన్ని ఖండించిన ఏసీబీ డీజీ

Sun,August 11, 2019 12:53 PM

ACB DG Purna Chander Rao press meet

హైదరాబాద్‌: తప్పుడు వార్తలను ప్రచురించిన ఆంధ్రజ్యోతిపై ఏసీబీ డీజీ పూర్ణచందర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్రికలో వచ్చిన కథనాలను ఖండించిన ఆయన చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేసి అసత్య కథనంపై మాట్లాడారు. 'మేం ఎంతో జాగ్రత్తగా, బాధ్యతగా విధులు నిర్వహిస్తున్నాం. ఇవాళ ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తను చూసి చాలా బాధపడ్డాను. మేం ఏదో లేఖను సీఎస్‌కు రాశామని ఆంధ్రజ్యోతిలో రాశారు. రాయని లేఖను రాసినట్లుగా అసత్య వార్త రాసిన పత్రికపై చర్యలు తీసుకుంటాం. నేను ఎలాంటి లేఖను ముఖ్యమంత్రికి, సీఎస్‌కు రాయలేదు. కానీ, రాసినట్లుగా వార్తను ప్రచురించారు. ఉద్దేశపూర్వకంగా ఇలాంటి వార్తలు రాస్తున్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటాం. నేను రాయని లేఖలు రాసినట్లు ప్రచురించడం ఎంత వరకు సమంజసం. మళ్లీ తిరిగి అసత్య ప్రచారం అని పత్రికలో ప్రచురించాలి. లేకుంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని' డీజీ పేర్కొన్నారు.

3281
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles