లంచం తీసుకుంటూ పట్టుబడిన ఆర్‌ఐ

Fri,October 12, 2018 09:53 PM

ACB caught corrupt RI in utkoor

ఊట్కూర్: రైతు వద్ద రూ.10 వేల లంచం తీసుకుంటూ ఆర్‌ఐ శుక్రవారం ఏసీబీకి పట్టుబడిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా ఊట్కూరులో చోటు చేసుకున్నది. ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. ఊట్కూరు మండలం పెద్దజట్రం గ్రామానికి చెందిన రైతు గంగనోళ్ల కొండారెడ్డి తనకున్న 13 ఎకరాల పొలంలో 6.5 ఎకరాల పొలాన్ని తన కూతురు శ్రీదేవి పేరు మీదకు బదలాయింపు కోసం జూన్‌లో రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు.

కాగా కొండారెడ్డి కొడుకు చెన్నారెడ్డి తన అక్క పేరు మీదకు పొలాన్ని రిజిష్టర్ చేయాలని తిరిగి తిరిగి వేసారాడు. ఆర్‌ఐ సతీష్‌కుమార్‌రెడ్డిని చెన్నారెడ్డి సంప్రదించగా.. రూ.10 వేలు చెల్లిస్తే పని పూర్తి చేస్తానని చెప్పాడు. దీంతో చెన్నారెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి పథకం ప్రకారం శుక్రవారం చెన్నారెడ్డి డబ్బులు అందిస్తుండగా.. ఏసీబీ అధికారులు ఆర్‌ఐని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. రెవెన్యూ కార్యాలయంలో ఉన్న మిగిలిన అధికారులు, సిబ్బందిని సైతం అధికారులు ప్రశ్నించారు. దాడిలో ఏసీబీ సీఐలు లింగస్వామి, కమల్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

2494
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles