ఏసీబీకి చిక్కిన రెవెన్యూ సిబ్బంది

Mon,March 18, 2019 10:33 PM

acb arrested revenue staff in kadthal

కడ్తాల్ : పౌల్ట్రీఫాం పెట్టుకునేందుకు ఎన్‌వోసీ సర్టిఫికెట్ కోసం డబ్బులు డిమాండ్ చేసిన నలుగురు రెవెన్యూ సిబ్బంది రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి దొరికారు. రంగారెడ్డి జిల్లా అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... కడ్తాల్ పట్టణానికి చెందిన ఎర్రోళ్ల రాంచంద్రయ్యకు కడ్తాల్ శివారులో సర్వే నెంబర్ 913, 914, 915లలో 1 ఎకరా 25 గుంటల పొలం ఉంది. సదరు పొలంలో పౌల్ట్రీ ఫాం వేసుకోవడానికి రాంచంద్రయ్య కుమారుడు ఎర్రోళ్ల వెంకటేశ్ ఎన్‌ఓసీ ధ్రువీకరణ పత్రం కోసం 2017 సంవత్సరం నవంబర్‌లో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. ఏడాది పాటు సర్టిఫికెట్ ఇవ్వకుండా తిప్పిన కడ్తాల్ రెవెన్యూ సిబ్బంది రూ. 23వేలు లంచం ఇస్తేనే పని అవుతుందని చెప్పడంతో బాధితుడు జిల్లా అవినీతి నిరోధకశాఖ అధికారులను ఆశ్రయించారు. దీంతో డబ్బులు తీసుకుంటుండగా ఆర్‌ఐ శ్రావణ్, అటెండర్ యాదగిరి, కంప్యూటర్ ఆపరేటర్ శ్రావణ్, వీఆర్‌ఏ బాల్‌రాజ్, ప్రైవేట్ వ్యక్తి రూప్‌సింగ్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అధికారిని సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశామరి ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ వివరించారు.

1686
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles