రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీఈ

Thu,October 10, 2019 02:13 PM

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కేటీపీఎస్ సీఈ ఆనంద్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. పనులకు సంబంధించిన బిల్లులు మంజూరు చేయడానికి కాంట్రాక్టర్ నుంచి ఆనంద్ లంచం డిమాండ్ చేశాడు. కాంట్రాక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వల పన్నిన అవినీతి నిరోదక శాఖ అధికారులు రూ. 3 లక్షలు లంచం తీసుకుంటుండగా రెండ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.


సీఈని అదుపులోకి తీసుకున్న అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లంచం ఇవ్వడం, లంచం తీసుకోవడం నేరమని ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు విజ్ఞప్తి చేశారు.

2992
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles