ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఆర్‌ఐTue,March 13, 2018 09:12 PM

ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఆర్‌ఐ

నర్సంపేట : వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట నగర పంచాయతీలో పనిచేస్తున్న ఆర్‌ఐ మెరుగు మురళి రూ.10వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాడెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్ తాళ్లపెల్లి సుదర్శన్‌గౌడ్ కథనం ప్రకారం.. వరంగల్ రూరల్ నర్సంపేట నగరపంచాయతీ పరిధిలో నివాసం ఉంటున్న జడల వెంకటేశ్వర్లు ఇంటి ఓనర్‌షిప్ ధ్రువీకరణ కోసం నగర పంచాయతీకి 2017 డిసెంబర్ 22న దరఖాస్తు చేశారు. దీనికిగాను నగర పంచాయతీలో పనిచేస్తున్న ఆర్‌ఐ మెరుగు మురళి రూ.30వేలు లంచం అడిగారు. దీనికిగాను మొదటి దఫాగా ఆర్‌ఐకి జడల వెంకటేశ్వర్లు రూ.20 వేలను ఇచ్చారు. ఇంకా రూ.10 వేలు ఇవ్వనిది ధ్రువీకరణ ఇవ్వనని మొండికేశారు. దీంతో వెంకటేశ్వర్లు చివరకు ఏసీబీ అధికారులను సంప్రదించారు. దీంతో రూ.10 వేలు ఇవ్వడానికి వెంకటేశ్వర్లు మల్లంపల్లి రోడ్డులో ఉండి ఆర్‌ఐ మురళికి ఫోన్ చేశారు. దీంతో నగర పంచాయతీ నుంచి మురళి నేరుగా మల్లంపల్లి రోడ్డులోకి వెళ్లి డబ్బులు వెంకటేశ్వర్లు నుంచి తీసుకుంటుండగా వెంటనే ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం ఆయనను నగర పంచాయతీకి తీసుకొచ్చి రికార్డులను పరిశీలించారు. రూ.10 వేలు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని మురళిపై కేసు నమోదు చేసి ఆయనను అరెస్టు చేశారు.

1116
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS