ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారులు

Sat,September 29, 2018 05:15 PM

ACB arrested corrupt officials in Nirmal and Vikarabad districts

నిర్మల్/ వికారాబాద్: ఆదిలాబాద్ మార్కెటింగ్ శాఖ డీఈఈ రవీందర్ అవినీతి నిరోదక శాఖకు చిక్కారు. రూ.ఒక లక్ష పదివేలు లంచం తీసుకుంటూ డీఈఈ పడ్డుబడ్డాడు. నిర్మల్ జిల్లా కుభీర్ మార్కెట్‌లో రోడ్డు పనుల బిల్లులు చెల్లించడానికి గుత్తేదారు నుంచి లంచం డిమాండ్ చేశాడు. వికారాబాద్ జిల్లాలో మోమిన్‌పేట సర్వేయర్ ఏసీబీకి చిక్కారు. 10 ఎకరాల భూమి సర్వే చేసేందుకు నగేశ్ అనే రైతు నుంచి రూ.20వేలు డిమాండ్ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరమని ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమను సంప్రదించాలని ఏసీబీ అధికారులు విజ్ఞప్తి చేశారు.

2147
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles