వర్షాలు కురవాలని పోచమ్మతల్లికి జలాభిషేకం

Sat,June 15, 2019 10:12 PM

abhishek to pochamma talli to get rains in wardhannapet

వర్ధన్నపేట: వర్షాలు సమృద్ధిగా కురవాలని వరంగల్ రూరల్‌ జిల్లా వర్ధన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో చిన్నారులు కప్పతల్లి ఆటలు ఆడుతుండగా, మహిళలు గ్రామ దేవతలకు జలాభిషేకాలు చేశారు. మండలంలోని రామవరం గ్రామంలో చిన్నారులు శనివారం కప్పతల్లి ఆటలు ఆడారు. అలాగే ఇల్లంద గ్రామంలో మహిళలు పోచమ్మ దేవాలయంలో జలాభిషేకం చేశారు. అమ్మవారి విగ్రహంపై మహిళలు బిందెలతో నీళ్లు తెచ్చి అభిషేకం చేశారు. వరుణదేవుడు సకాలంలో వర్షాలు కురిపించాలని కోరుతూ పోచమ్మ దేవత విగ్రహానికి జలాభిషేకం చేయడం జరుగుతుందని మహిళలు చెప్పారు.

291
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles