HomeLATEST NEWSabducted baby child identified at Ellareddy in Kamareddy district

అపహరణకు గురైన శిశువు ఆచూకీ గుర్తింపు

Published: Thu,May 9, 2019 04:32 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   
సంగారెడ్డి: సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో అపహరణకు గురైన శిశువు ఆచూకీ లభించింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి సమీపంలో పోలీసులు పాపను గుర్తించి నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. శిశువును సంగారెడ్డి డీఎస్పీకి అప్పగించారు. శిశువును అపహరించిన నిందితులు బంగారి సంతోష్, శోభలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను సంగారెడ్డికి తరలించారు. శిశువు అనారోగ్యంతో ఉండటంతో వైద్య పరీక్షల కోసం మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గత మూడు రోజులుగా పాలు లేనందున పాప అనారోగ్యానికి గురైంది. వారం క్రితమే నిందితులైన సంతోష్, శోభల కూతురు ప్రసవించింది. కాగా పురిట్లోనే శిశువు మృతిచెందింది. ఆ స్థానంలో మరో శిశువును ఉంచేందుకు శిశువును అపహరించారు.
1082
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology