రేపటి నుంచి పెరిగిన ఆసరా పింఛన్లు...

Fri,July 19, 2019 08:26 PM

aasara pensions rs 2016 for tomorrow

హైదరాబాద్: రేపటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన పింఛన్లు అమలులోకి రానున్నాయి. పెరిగిన పింఛన్లకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందించనున్నారు. వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, గీత కార్మికులు, నేత కార్మికులు, ఒంటరి మహిళలు, బోదకాలు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులకు ఇస్తున్న పింఛన్‌ను రూ.1000 నుంచి రూ.2016కు, దివ్యాంగులు, వృద్ధ కళాకారుల పెన్షన్‌ను రూ.1500 నుంచి రూ.3016కు పింఛన్లు పెరగనున్నాయి. పెంచిన పింఛన్లు అందించటానికి సంవత్సరానికి రూ.12 వేల కోట్లు ఖర్చు అవుతుంది. దీంట్లో రూ.11,800 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుండగా కేంద్రం రూ.200 కోట్లను ఇస్తున్నది.

4363
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles