మహిళపై అత్యాచారం.. ఆ తర్వాత హత్య

Wed,March 20, 2019 06:44 AM

a woman killed by unknown persons in Shamshabad

రంగారెడ్డి : గుర్తు తెలియని మహిళపై లైంగికదాడికి పాల్పడి... ఆపై దారుణంగా హత్యచేసి కాల్చేశారు. ఈ ఘటన మంగళవారం శంషాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. సీఐ విజయభాస్కర్ రెడ్డి వివరాల ప్రకారం... శంషాబాద్ మండలం, తొండుపల్లి గ్రామ పరిధిలోని శివారులోని నిర్మానుష్య ప్రాంతంలో కాలిపోయిన మృతదేహాన్ని స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెళ్లి వివరాలు సేకరించారు. గుర్తు తెలియని దుండగలు గుర్తు తెలియని మహిళపై లైంగికదాడికి పాల్పడి.... ఆపై హత్య చేసి... ఆనవాలు దొరకకుండా పెట్రోలు పోసి తగులబెట్టినట్లు పోలీసులు గుర్తించారు. క్లూస్‌టీంను రంగంలోకి దింపి ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేసున్నారు.

9798
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles