నిలిచిపోయిన అంబులెన్స్.. బాలింత మృతి

Wed,January 31, 2018 12:25 PM

a woman dies in ambulance due to traffic jam at Yeturu Nagaram

వరంగల్ : భారీ ట్రాఫిక్‌జామ్ కారణంగా మార్గమధ్యలోనే అంబులెన్స్ నిలిచిపోవడంతో బాలింత మృతి చెందిన సంఘటన ఏటూరు నాగారంలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. బాసరకు చెందిన కళాభాయ్ కుటుంబం.. మేడారం జాతరకు రెండు రోజుల క్రితం వచ్చారు. కళా భాయ్ గర్భిణి కావడంతో ఆవిడకు ఉదయం పురిటినొప్పులు వచ్చాయి. దీంతో హుటాహుటిన ఆమె కుటుంబ సభ్యులు ఏటూరు నాగారం ఆస్పత్రికి తరలించారు. పండంటి మగబిడ్డకు కళాభాయ్ జన్మనిచ్చింది. అయితే బాలింతకు తీవ్ర రక్తస్రావం కావడంతో.. ములుగు ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో బాలింతను అంబులెన్స్‌లో ములుగు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. మేడారంకు భారీగా వాహనాలు వస్తుండటం, భక్తుల రద్దీ కారణంగా అక్కడ భారీగా ట్రాఫిక్‌జాం ఏర్పడింది. రెండు, మూడు గంటల పాటు ట్రాఫిక్‌జాం ఏర్పడటంతో.. మార్గమధ్యలోనే బాలింత మృతి చెందింది. దీంతో మృతురాలి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

2019
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles