తల్లీబిడ్డల సంరక్షణపై ప్రత్యేక దృష్టి: మంత్రి లక్ష్మారెడ్డి

Tue,May 2, 2017 09:31 PM

A Special attention on mother and child care

హైదరాబాద్: తల్లీబిడ్డల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వ ఆస్పత్రుల సూపరింటెండెట్లను రాష్ట్ర వైద్య-ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆదేశించారు. నగరంలోని కోఠి కుటుంబ సంక్షేమశాఖ కార్యాలయంలో ప్రభుత్వ ఆస్పత్రుల సూపరింటెండెట్లతో మంత్రి లక్ష్మారెడ్డి ఇవాళ సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆస్పత్రుల్లో సమస్యలు లేకుండా వైద్యులు సమర్థవంతంగా సేవలు అందించాలన్నారు. అమ్మ ఒడి పథకంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు. నిలోఫర్‌లో మే 30 నుంచి మిల్క్‌బ్యాంక్ అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. తల్లిపాలు అందని పిల్లలకు పాలు అందించేందుకు మిల్క్ బ్యాంక్ ఏర్పాటు కానుంది. ఇందుకు సంబంధించి గోడపత్రికను మంత్రి ఆవిష్కరించారు. స్వచ్ఛంద సంస్థలు ధాత్రి, డాక్టర్ ఫర్ సేవ ఈ మిల్క్‌బ్యాంక్‌ను ప్రారంభించనున్నాయి.

600
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles