నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు

Mon,June 19, 2017 07:11 AM

హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా మరో రెండురోజులు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. సోమ, మంగళవారాల్లో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టినా, బుధవారం నుంచి మళ్లీ పెరుగవచ్చని పేర్కొన్నారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా బెజ్జంకిలో 4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. మేడ్చల్‌లో 3 సెం.మీ, మంథని, శామిర్‌పేట, తాండూరు, హకీంపేట, దుబ్బాకల్లో 2 సెం.మీ. చొప్పున వర్షం కురిసింది.

604

More News

మరిన్ని వార్తలు...