బాలికను పెళ్లి చేసుకున్న ప్రధానోపాధ్యాయుడు

Fri,May 11, 2018 03:19 PM

a principal marriage with minor at Shamshabad

రంగారెడ్డి : మాయమాటలతో మభ్యపెట్టి బాలికను పెళ్లి చేసుకున్నాడు ఓ ప్రధానోపాధ్యాయుడు. ఈ సంఘటన శంషాబాద్ మండలం ముచ్చింతల్ గ్రామంలో వెలుగు చూసింది. ముచ్చింతల్‌కు చెందిన ఓ బాలిక ఇటీవల వెల్లడించిన పదో తరగతి ఫలితాల్లో ఫెయిల్ అయింది. ఫెయిలైన సబ్జెక్ట్.. పాస్ చేయిస్తానని చెప్పి బాలికకు మాయమాటలు చెప్పి ప్రధానోపాధ్యాయుడు అక్బర్ ఆమెను తీసుకెళ్లిపోయాడు. ఆ తర్వాత బాలికను పెళ్లి చేసుకున్నాడు. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు శంషాబాద్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు.. ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

7346
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles