పంచాయతీ ఎన్నికలు.. ఏజెంట్ కు గుండెపోటు

Mon,January 21, 2019 12:56 PM

సూర్యాపేట : మునగాల మండలం ఆకుపాముల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆ గ్రామంలోని ఆరవ వార్డు తరపున సత్యం రాజు(70) అనే వ్యక్తి పోలింగ్ బూత్ లో ఏజెంట్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయనకు అనుకోకుండా గుండెపోటు రావడంతో బూత్ లోనే కుప్పకూలిపోయాడు. దీంతో సత్యం రాజును చికిత్స నిమిత్తం హుటాహుటిన కోదాడ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. రాజు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

962
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles