మరణిస్తూ ఐదుగురికి ప్రాణదానం

Tue,August 6, 2019 06:43 AM

a person dies due to brain dead

హైదరాబాద్ : ప్రమాదవశాత్తు.. అనారోగ్యం.. తదితర కారణాలతో మరణించినా వారి అవయవాలను ఇతరులకు దానం చేయడం ద్వారా తిరిగి ఇతరుల్లో జీవిస్తున్నారు. సిద్ధిపేట జిల్లా ములుగు మండలం, మామిడ్యాల గ్రామానికి చెందిన ఆరె శంకర్(29) వ్యవసాయం పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయన భార్య చంద్రకళ, కుమార్తె రేణుక, కుమారుడు బన్నీ ఉన్నారు.

ఈనెల 1న శంకర్ హైదరాబాద్‌లో ఉంటున్న తన సోదరిని కలిసేందుకు ములుగు నుంచి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. మార్గమధ్యలో వాహనం అదుపుతప్పి కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో శంకర్ తలకు తీవ్రంగా గాయంకాగా, 108లో గజ్వేల్‌లోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. 2వ తేదీన మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్‌లోని యశోద దవాఖానకు తరలించగా, చికిత్స అందిస్తుండగానే బ్రెయిన్ డెడ్‌కు గురికాగా, వైద్యులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.

ఈ మేరకు జీవన్‌దాన్ ప్రతినిధులు అవయదానం కోసం శంకర్ కుటుంబ సభ్యులను సంప్రదించారు. అవయవ దానం విశిష్టతను వివరించగా, అందుకు వారు అంగీకరించారు. శంకర్ శరీరం నుంచి కాలేయం, మూత్రపిండాలు, గుండెను సేకరించారు. సేకరించిన అవయవాలను ఐదుగురు రోగులకు అమర్చి వారికి ప్రాణం పోశారు వైద్యులు.

1143
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles