జగిత్యాలలో దారుణం.. వ్యక్తిపై గొడ్డలితో దాడి

Mon,April 15, 2019 02:00 PM

a person attack on another with axe in Jagitial

జగిత్యాల : జగిత్యాలలో దారుణం చోటు చేసుకుంది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి.. మరో వ్యక్తిపై గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి.. సీటు కింద నుంచి గొడ్డలి తీసి.. మరో వ్యక్తిపై దాడి చేశాడు. దాదాపు 8 సార్లు అతడిపై గొడ్డలితో దాడి చేయడంతో కడుపు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడి పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితుడిని తిప్పర్తి కిషన్‌గా, దాడి చేసిన వ్యక్తిని కత్రోజు లక్ష్మణ్‌గా పోలీసులు గుర్తించారు. లక్ష్మణ్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ గొడవకు భూతగాదాలే కారణమని తెలుస్తోంది.

7361
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles