సవతితల్లి కండ్లలో కారం చల్లి..కొడవలితో నరికి హత్య

Wed,May 1, 2019 06:11 AM

A Man Brutally Kills Stepmother

మాదన్నపేట: ఆస్తి తగాదాలతో సవతి తల్లిని హత్య చేశాడు. కండ్లల్లో కారం చల్లి, కొడవలితో నరికి దారుణంగా చంపేశాడు. ఈ సంఘటన మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. మాదన్నపేట బోయబస్తీకి చెందిన కొలను యాదయ్యకు ఇద్దరు భార్యలు బాలమణి, సుకన్య. బాలమణికి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు. సుకన్యకు కుమారుడు, కూతురు. కాగా... ఈ మధ్య కాలంలో యాదయ్య అనారోగ్యంతో మృతి చెందాడు.

అంతకు ముందే మొదటి భార్య కుమారుడు ఏఆర్ కానిస్టేబుల్ అయిన శ్రీకాంత్‌కు బీహెచ్‌ఈఎల్ టౌన్‌షిప్‌లో కోటి రూపాయల విలువచేసే ఇల్లు, మాదన్నపేటలో మరో ఇల్లు ఇచ్చారు. అయితే తండ్రి.. రెండో భార్య కుటుంబానికి ఇచ్చిన ఆస్తి కూడా తనకే కావాలని కొద్ది రోజులుగా శ్రీకాంత్ గొడవపడుతున్నాడు. తండ్రి మృతి చెందిన అనంతరం సవతి తల్లి ఆస్తి తనకు దక్కదని భావించిన శ్రీకాంత్.. ఎలాగైన ఆమెను చంపాలనుకున్నాడు. ఇందులో భాగంగా శ్రీకాంత్ మంగళవారం ఉదయం మాదన్నపేటలోని సవతితల్లి సుకన్య ఇంటికి వచ్చాడు. వెంట తెచ్చుకున్న కారాన్ని సుకన్య కండ్లల్లో చల్లి, కొడవలితో నరికి దారుణంగా హత్య చేశాడు.

కండ్ల ఎదుటే తల్లిపై దాడి చూసిన ఇద్దరు పిల్లలు భయబ్రాంతులకు గురై పరిగెత్తుతూ పక్కనే ఉన్న బంధువుల వద్దకు వెళ్లి సమాచారం ఇచ్చారు. పిల్లల అరుపులకు స్థానికులు , బంధువులు చేరేలోపే శ్రీకాంత్ పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ మే రకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

పట్టించుకోని పోలీసులు

గతంలో శ్రీకాంత్ పలుమార్లు మాదన్నపేటలో నివాసం ఉంటున్న తండ్రి, సవతి తల్లిపై దాడి చేశాడు. పోలీస్ స్టేషన్ట్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మృతురాలి పిల్ల లు ఆరోపిస్తున్నారు. పలు మార్లు ఇంటికి వచ్చి చంపుతానని బెదిరించగా... సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృ శ్యాలను శ్రీకాంత్ తొలగించాడు. తన తండ్రి మృతి చెందాక పెద్దమ్మ కొడుకు శ్రీకాంత్‌తో ప్రమాదం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని పిల్లలు ఆరోపిస్తున్నారు.

నిందితుడిని కఠినంగా శిక్షించాలి

రెండు నెలల క్రితమే తండ్రిని కోల్పోయాం. ఇప్పడు తల్లి దారుణ హత్యకు గురైయింది. మాకు భద్రత ఎవరు ఇస్తారని మృతురాలి పిల్లలు పోలీసులను ప్రశ్నిస్తున్నారు. కండ్ల ఎదుటే తల్లి పై దాడి చేసి హత్య చేసిన నిందితుడు శ్రీకాంత్‌నుకఠినంగా శిక్షించాలని పిల్లలు కోరుతున్నారు.

3595
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles