యువతితో కలిసి వివాహితుడు ఆత్మహత్య

Wed,September 19, 2018 03:50 PM

a lovers suicide in khammam dist

ఖమ్మం : భార్యకు భర్త ప్రేమ విషయం తెలియడంతో.. ఆ వివాహితుడు తన ప్రియురాలితో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద సంఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం నీలాద్రిశ్వరాలయం వద్ద చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా తిరువూరు మండలం కోకిలంపాడు గ్రామానికి చెందిన జొన్నలగడ్డ తిరుపతిరావు(23) ఇటీవలే పెళ్లి అయింది. అయితే తిరుపతిరావుకు ప్రియురాలి ఉంది. ఈ విషయం భార్యకు తెలిసింది. దీంతో ప్రియురాలు లక్ష్మీ(19)తో కలిసి తిరుపతిరావు కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకొని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

2343
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles