ఘర్షణలతో శాంతి చేకూరదు: దలైలామా

Sun,February 12, 2017 11:30 AM

A Human Approach to World Peace Dalai Lama

హైదరాబాద్: నగరంలో బౌద్ధమత గురువు దలైలామా పర్యటిస్తున్నారు. హైటెక్స్ రోడ్‌లో దలైలామా సెంటర్ ఫర్ ఎథిక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన కార్యక్రమంలో దలైలామా, రాష్ట్ర గవర్నర్ నరసింహన్, మంత్రి కేటీఆర్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ పాల్గొన్నారు. హైటెక్స్‌లో నీతి- విలువలు అనే అంశంపై దలైలామా ప్రసంగిస్తున్నారు. ఎవరినైనా చిరునవ్వుతో పలకరించడం అలవర్చుకోవాలి. చిరునవ్వు పలకరింపు మనకు, ఎదుటివారికి సాంత్వన చేకూరుతుందని ఆయన హితవు పలికారు. హత్యలు, ఘర్షణలతో శాంతి చేకూరదు, అహింస తోనే ప్రపంచ శాంతి చేకూరుతుందని పిలుపునిచ్చారు.

మహాత్మాగాంధీ ఒక్కరే అహంస సిద్ధాంతాన్ని పాటించారు. గ్లోబర్ వార్నింగ్ అనేది అన్ని దేశాలకు సమస్యగా మారింది. వందల ఏళ్ల క్రితమే ఎందరో విదేశీయులు భారతదేశ గొప్పతనాన్ని గుర్తించారు. ప్రపంచానికి తత్వశాస్ర్తాన్ని బోధించిన పుణ్యభూమి భారత్. వైదిక మతంతో పాటు ఇస్లాం, బౌద్ధం, క్రైస్తవం, జొరాస్టియన్ మతాలను ఆదరించిన దేశం ఇది. పాకిస్థాన్ కంటే భారత్‌లోనే ముస్లీలు ఎక్కువగా ఉన్నారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని మతస్వేచ్ఛ, శాంతి భారత్‌లోనే ఉందని తెలిపారు.

1094
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles