అత్తింటి వేధింపులకు వివాహిత బలి

Mon,May 20, 2019 06:21 AM

a house wife suicide in shamshabad

హైదరాబాద్ : అత్తింటి వేధింపులకు ఓ వివాహిత బలైన సంఘటన శంషాబాద్ ఆర్‌జీఐఏ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, బంధువులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం మండలం కపాడ్‌కు చెందిన అక్షిత(25)కు, శంషాబాద్‌లోని ఆర్‌బీనగర్‌కు చెందిన సోమన్నగారి రాఘవేందర్‌రెడ్డికి ఏడాది క్రితం వివాహం జరిగింది. రాఘవేందర్‌రెడ్డి వృత్తిరీత్యా అడ్వకేట్. కాగా, కొంతకాలం నుంచి వీరి మధ్య కుటుంబ కలహాలు, వేధింపులు మొదలయ్యాయి. దీంతో శనివారం అర్ధరాత్రి అక్షిత ఫ్యాన్‌కు ఉరేసుకున్నది. వెంటనే స్థానిక ప్రైవేట్ దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

దీంతో మృతురాలు కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందిచడంతో ఆర్‌బీనగర్‌కు చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. అక్షితను భర్త, అత్తమామలే చంపారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. కట్నం భారీగా ఇచ్చి ఘనంగా వివాహం చేశామని బోరున విలపించారు. అక్షిత మృతదేహంతో ఆమె బంధువులు భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగి బైఠాయించారు. భర్త, అత్తామామలను వెంటనే అరెస్టు చేయాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు.

4711
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles