సింగరేణి.. ఇండ్ల పట్టాల పంపిణీపై ఉన్నతస్థాయి సమీక్ష

Wed,June 12, 2019 06:05 PM

a high level review meeting on Singareni lands giving to govt

హైదరాబాద్‌: సింగరేణి కంపెనీ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని ఎంతోకాలంగా జీవిస్తున్న కార్మికులకు పట్టాల మంజూరు విషయమై నేడు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రిన్సిపల్‌ కార్యదర్శి ఎస్‌.నర్సింగరావు అధ్యక్షతన భేటీ జరిగింది. ఈ సమావేశంలో సింగరేణి సంస్థ సీఎండీ శ్రీధర్‌, రెవెన్యూశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్‌ తివారీ, డైరెక్టర్‌ మైన్స్‌ అండ్‌ జియాలజీ సుశీల్‌ కుమార్‌, జాయింట్‌ డైరెక్టర్‌ రఫిక్‌ అహ్మద్‌తో పాటు సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు వనమా వెంటకేశ్వర రావు, గండ్ర వెంకటరమణా రెడ్డి, బాల్క సుమన్‌, ఆత్రం సక్రు, రేగా కాంతారావు పాల్గొన్నారు. గతేడాది శ్రీరాంపూర్‌ ఏరియాలో జరిగిన సింగరేణి కార్మికుల ఆత్మీయ సమ్మేళనంలో సీఎం కేసీఆర్‌ పాల్గొని ఇంటి స్థలాలపై పట్టాలు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. సీఎం హామీపై సింగరేణి సంస్థ ప్రత్యేక చొరవ తీసుకుంది. గతంలో ప్రభుత్వం ద్వారా సింగరేణి సంస్థకు కేటాయించబడిని ఆయా నివాసిత స్థలాలను గుర్తించి వాటిని తిరిగి జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. ఈ విధంగా ఆరు జిల్లాల్లో కలిపి మొత్తం 1,713 ఎకరాల భూమిని తిరిగి సంబంధిత జిల్లా యంత్రాంగాలకు సింగరేణి అప్పగించింది. దీంతో కంపెనీ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి ప్రభుత్వం ద్వారా పట్టాలు లభించేందుకు మార్గం సుగుమమైంది.

934
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles