టీఆర్‌ఎస్‌కే ఓటేందుకు వేయాలంటే..

Fri,September 14, 2018 12:33 PM

A farmer Podeti Bhumaiah has painted his walls listing out the reasons why he will vote for trs

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు ఏ పార్టీకి ఓటేయ్యాలో దీర్ఘంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణలో అభివృద్ధి అడుగంటిన విషయం అందరికీ తెలిసిందే. అన్ని రంగాల్లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ రంగంలో నెంబర్‌వన్‌గా నిలిచింది. ఈ నాలుగేళ్లలో అభివృద్ధిలో పరుగులు పెట్టించిన ఇంటి పార్టీ టీఆర్‌ఎస్‌కు ఓటేయ్యాలని ప్రజలందరూ నినదిస్తున్నారు. ఆసరా పెన్షన్లు మొదలుకొని రైతు బంధు, రైతు బీమా పథకాలు రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని ప్రజలు తేల్చిచెబుతున్నారు.

మా ఇంటి ఓట్లు టీఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారికే వేయబడును అని ఇబ్రహీంపట్నం(జగిత్యాల జిల్లా) గ్రామానికి చెందిన పోడేటి భూమయ్య తన ఇంటి గోడపై వినూత్నంగా రాయించారు. టీఆర్‌ఎస్‌కే ఓటేందుకు వేయాలో పోడేటి భూమయ్య తన ఇంటి గోడపై రాయించాడని కేటీఆర్ ట్వీట్ చేశారు.

గోడపై రాసి ఉన్న సారాంశం..
-మా భూమి ఎకరాకు రూ. 4 వేలు పెట్టుబడి సహాయం అందించినందుకు
-24 గంటల నిరంతరాయ విద్యుత్ ఇస్తున్నందుకు
-వెయ్యి రూపాయాలు ఆసరా పెన్షన్ ఇస్తున్నందుకు
-కల్యాణలక్ష్మీతో పాటు మా కోడలికి అండగా నిలిచినందుకు
-కంటి వెలుగుతో మా దంపతుల కళ్ళను కాపాడినందుకు

ఇలా రాసుకుంటూ పోతే నా గోడ సరిపోదు.. నాకే కాదు.. ఇలా అందరికి అండగా ఉన్న ప్రభుత్వాన్ని మళ్లీ కోరుకుంటున్నాము! అందుకే మా కుటుంబం ఓట్లు కారు గుర్తుకు మాత్రమే వేయబడును అని రాయించాడు పోడేటి భూమయ్య.
4825
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles