కుక్క పిల్లలపై నాగుపాము దాడి

Thu,September 20, 2018 11:40 AM

a Cobra attacking a dog puppies caught on tape in Odisha

భువనేశ్వర్ : ఓ కుక్క తన ఐదు కుక్క పిల్లలను నాగుపాము నుంచి కాపాడుకునేందుకు శతవిధాలా ప్రయత్నం చేసింది. కానీ బుసలు కొడుతున్న నాగు.. నాలుగు కుక్క పిల్లలను కాటేసింది. ఈ సంఘటన ఒడిశాలోని భద్రక్‌లో చోటు చేసుకుంది. ఓ ఇంటి వద్ద కుక్క తన ఐదు కుక్క పిల్లలతో ఉంది. కుక్క పిల్లలను చూసిన నాగుపాము బుసలు కొడుతూ.. వాటిపైన దాడి చేసింది. నాగుపాము నుంచి కుక్క పిల్లలను కాపాడుకునేందుకు ఆ కుక్క వీరోచిత పోరాటం చేసింది. కానీ నాగుపాము నుంచి తన కుక్క పిల్లలను కాపాడుకోలేకపోయింది. నాలుగు కుక్క పిల్లలు ప్రాణాలు కోల్పోగా, ఒక కుక్క పిల్ల గాయాలతో బయటపడింది. అయితే అటవీశాఖ అధికారులు ఆలస్యంగా రావడం వల్లే నాలుగు కుక్క పిల్లలు చనిపోయాయని స్థానికులు పేర్కొన్నారు.

6175
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles