ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి

Thu,September 19, 2019 09:56 PM

ములుగు : ప్రమాదవశాత్తు చెరువులో పడి నీట మునిగి వ్యక్తి మృతి చెందిన సంఘటన ములుగు జిల్లా వాజేడు మండలంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై రాందేని స్వామి కథనం ప్రకారం.. మండలంలోని అయ్యవారిపేట గ్రామానికి చెందిన కావిరి శేషరావు(30) తన పశువులను మేపేందుకు బుధవారం ఊరి బయటకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో చెరువులోని గుంటలో ప్రమాదవశాత్తు జారిపడి నీటిలో మునిగి ఊపిరాడక చనిపోయాడు. ఎంతకి ఇంటికి రాకపోవడంతో బంధువులు వెతకగా గురువారం ఉదయం చెరువులో మృతి చెంది కనిపించాడు. దీంతో పేరూరు పోలీసు స్టేషన్‌లో మృతుడి సోదరుడు ఈశ్వర్‌రావు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలికి చేరుకున్న ఎస్సై రాందేని స్వామి వివరాలు సేకరించి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

803
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles