తహశీల్దార్ సంతకం ఫోర్జరీ చేసిన 9 మంది అరెస్ట్

Thu,March 1, 2018 09:39 PM

9 people arrested by Tahsildar signature Forgery case

కోదాడ : తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసి 700 ట్రిప్పుల ఇసుకను ట్రాక్టర్ల ద్వారా అక్రమ రవాణా చేసిన సంఘటన సూర్యాపేట జిల్లా కోదాడలో వెలుగుచూసింది. ఈ ఘటనలో ఉన్న 9 మంది నిందితులను కోదాడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కోదాడ డీఎస్పీ రమణారెడ్డి వివరాల ప్రకారం..గత నెల 24న ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను కోదాడ పట్టణంలో తనిఖీ చేయగా నకిలీ బిల్లులని తేలింది. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండల తహశీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి డూప్లికేట్ బిల్లులతో నాలుగు నెలల నుంచి దోసపహాడ్ నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ఈ రవాణాలో కోదాడకు చెందిన అనుములపూడి నవీన్‌తోపాటు ఓ చానల్‌కు చెందిన విలేకరి శ్రీనివాస్ ప్రధాన పాత్ర పోషించారు. ఇందుకు అవసరమైన రవాణా బిల్లుల నమునా, బిల్‌పుస్తకాలు, రబ్బర్ స్టాంపులు సూర్యాపేటలో తయారు చేయించారు. వీటితో చానల్ విలేకరి శ్రీనివాస్ 500 ట్రిప్పులు, నవీన్ 200 ట్రిపుల ఇసుక అక్రమ రవాణా చేశారు. వీరి నుంచి 5 ఇసుక ట్రాక్టర్లు, 5 రబ్బర్ స్టాంపులు, 4 బిల్‌బుక్‌లు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. వీరితోపాటు వీరికి సహకరించిన మరో ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు డిఎస్పీ రమణారెడ్డి వెల్లడించారు.

1824
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS