ఆదిలాబాద్‌లో రూ.80 లక్షలు పట్టివేత..!

Sat,November 17, 2018 09:55 PM

80 lakhs seized transported by car in adilabad

ఆదిలాబాద్: పట్టణంలోని పంజాబ్‌చౌక్‌లో పోలీసులు సాధారణ వాహనాల తనిఖీలు చేస్తుండగా.. ఓ కారులో డబ్బు తరలిస్తుండగా.. పోలీసులు పట్టుకున్నారు. కారు యజమాని ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో పోలీసులు సర్వేలైన్స్ బృందానికి సమాచారం అందించారు. బృందం సభ్యులు డబ్బుతో పాటు కారును స్వాధీనం చేసుకొని కలెక్టరేట్ కార్యాలయానికి తీసుకెళ్లారు.

పట్టణానికి చెందిన జిన్నింగ్ మిల్లు యజమాని వై.మాధవ్ వ్యాపారం నిమిత్తం శనివారం సాయంత్రం ఎస్‌బీహెచ్ బ్యాంక్‌లో రూ.80 లక్షలు డ్రా చేసి రాంపూర్ రోడ్డులోని శ్రీరాం జిన్నింగ్ మిల్లుకు టీఎస్01 ఈజే 3729కారులో తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో పంజాబ్ చౌక్‌లో వన్‌టౌన్ ఎస్సై గుణవంత్‌రావు, సిబ్బంది కారును ఆపి తనిఖీ చేశారు. కారు డిక్కీ, వెనుక సీటు కింద భాగంలో సంచుల్లో డబ్బు పెద్ద మొత్తంలో ఉండడాన్ని గమనించారు. యజమాని వై.మాధవ్‌ను డబ్బుకు సంబంధించిన ఆధారాలు చూపమని అడిగారు. తాను బ్యాంక్‌లో నుంచి డబ్బు డ్రా చేసుకొని జిన్నింగ్ మిల్లుకు తీసుకెళ్తున్నానని, కొంత సమయం ఇస్తే ఆధారాలు చూపిస్తానని చెప్పినట్లు తెలిసింది. పెద్ద మొత్తంలో డబ్బు ఉండడంతో పోలీసులు వెంటనే సర్వేలైన్స్ బృందానికి సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకొని డబ్బుతో పాటు కారును స్వాధీనం చేసుకొని కలెక్టర్ కార్యాలయానికి తరలించారు. ఈ విషయమై యజమాని వై.మాధవ్ బ్యాంక్ అధికారులకు సమాచారం ఇవ్వగా.. అధికారులు కలెక్టర్ కార్యాలయానికి వెళ్లినట్లు తెలిసింది.

2266
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles