80 గంటల ఉపన్యాసం.. గిన్నిస్‌ బుక్ రికార్డు

Tue,September 25, 2018 10:54 PM

80 hour lecture enters guinness book of records

వరంగల్: డిగ్రీ విద్యార్థి అఖిల్ మూడు రోజులుగా వరంగల్‌లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో కొనసాగిస్తున్న 80 గంటల ఉపన్యాసం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకు ఎంపికైంది. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు , చరిత్ర ప్రపంచీకరణలో వస్తున్న మార్పులు, తెలంగాణ ఉద్యమం అభివృద్దిపై అఖిల్ మూడు రోజులు ఉపన్యాసమిచ్చారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ అభినందించారు. చివరి రోజు మంగళవారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ బన్నా అయిలయ్య పలువురు విద్యావంతులు అఖిల్ ప్రతిభను కొనియాడారు. 80 గంటల ఉపన్యాసాన్ని విజయవంతంగా పూర్తి చేసిన అఖిల్‌ను తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ సీఈవో డాక్టర్ బొమ్మారెడ్డి శ్రీనువాస్‌రెడ్డి ,వరంగల్ కోర్డినేటర్ రఘునందన్ ,సురేస్ శాలువా మెమోంటోతో అభినందించారు.

3380
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles