80.57 కోట్ల చేప పిల్లల విడుదల లక్ష్యం : మంత్రి తలసాని

Thu,September 19, 2019 06:21 PM

హైదరాబాద్ : రాష్ట్రంలోని మత్స్యశాఖ అధికారులతో సచివాలయం నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 30 నాటికి చేప పిల్లల విడుదల కార్యక్రమం పూర్తి చేయాలని మంత్రి తలసాని సూచించారు. ఈ ఏడాది 21,756 నీటి వనరుల్లో 80.57 కోట్ల చేప పిల్లల విడుదల లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ నెల 16న కాళేశ్వరంలో చేప పిల్లల విడుదల కార్యక్రమం ప్రారంభించాం. ఇప్పటి వరకు 5,958 నీటి వనరుల్లో 19.38 కోట్ల చేప పిల్లలు విడుదల చేశాం. చేప పిల్లల నాణ్యత, పరిమాణం విషయంలో రాజీ పడొద్దు. ప్రజాప్రతినిధులు, మత్స్యకారులను భాగస్వాములను చేయాలి అని మంత్రి తలసాని సూచించారు.

653
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles