8వేలకు పైగా పోస్టర్లు, బ్యానర్లు తొలగింపు

Fri,March 15, 2019 06:46 AM

8 thousand Posters, Banners removed in Hyderabad


హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా హైదరాబాద్‌ జిల్లా పరిథిలోని రెండు పార్లమెంటు స్థానాల్లో ఎనిమిది వేలకుపైగా పోస్టర్లు, బ్యానర్లను తొలగించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎం.దానకిషోర్‌ తెలిపారు. వీటితోపాటు గోడలపై ఉన్న 2900వాల్‌రైటింగ్స్‌ను తొలగించినట్లు ఆయన పేర్కొన్నారు. అనుమతి లేకుండా ఎటువంటి ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటుచేసినా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్ఛరించారు. నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలు, ప్రహరీగోడలపై 5737బ్యానర్లు, ఫ్లెక్సీలు, పోస్టర్లను తొలగించగా, ప్రైవేటు భవనాలపై మరో 2265 తొలగించామన్నారు.

ఇప్పటివరకు నగరంలో నిర్వహించిన సోదాల్లో పోలీసుశాఖ ద్వారా రూ.9050400 నగదుపు స్వాధీనం చేసుకొని తదుపరి చర్యలకోసం ఆదాయపు పన్నుశాఖకు అప్పగించామన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలుచేసేందుకు ఇప్పటికే నియోజకవర్గాలవారీగా నిఘా బృందాలను ఏర్పాటుచేసినట్లు కమిషనర్‌ వివరించారు. మరోవైపు, ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా వృద్ధులు, దివ్యాంగుల సౌకర్యార్థం పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. ర్యాంపుల నిర్మాణం, గ్రిల్స్‌ ఏర్పాటు తదితర పనులు చేస్తున్నారు. ఓటింగ్‌ శాతం పెంచేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రవర్తనా నియమావళి అమల్లో భాగంగా ఎన్నికల ప్రచారపర్వంతోపాటు నగదు తరలింపుపై ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటుచేశారు. అంతేకాకుండా, రెండు పార్లమెంటు స్థానాల పరిథిలో అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా సహాయ రిటర్నింగ్‌ అధికారులను నియమించారు.

1250
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles