8 మృతదేహాలు వెలికితీత..27 మంది సురక్షితం

Sun,September 15, 2019 10:26 PM


తూర్పుగోదావరి: పాపికొండ టూర్ లో 60 మంది ప్రయాణిస్తున్న బోటు ముంపు ప్రమాద ఘటనలో ఇప్పటివరకు 8 మృతదేహాలు వెలికితీశారు. ఎన్డీఆర్ ఎఫ్, నేవీ సిబ్బంది 27 మందిని సురక్షితంగా ప్రాణాలతో కాపాడారు. అదృశ్యమైన మరో 25 మంది కోసం రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. 6 అగ్నిమాపక బృందాలు, 08 ఐఆర్ బోట్లు, 12 అస్కా లైట్లు, శాటిలైట్ ఫోన్ల సాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 8 మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ఆస్పత్రికి తరలించారు. ఏపీ మంత్రులు, తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, అధికారులు సహాయకచర్యలను పర్యవేక్షిస్తున్నారు.

1422
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles