వరంగల్ రూరల్ జిల్లాలో 77.84 శాతం పోలింగ్ నమోదు

Fri,May 10, 2019 08:19 PM

77 percent of polling recorded in warangal rural dist

- ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు
వరంగల్ రూరల్: జిల్లాలో రెండో విడత ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలోని ఆరు మండలాల్లోని 367 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగగా 1,34,251 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆరు మండలాల్లో జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో 77.84 శాతం పోలింగ్ నమోదైనట్లు జిల్లా అధికారులు చెప్పారు.

జిల్లాలోని పరకాల, నడికూడ, శాయంపేట, రాయపర్తి, ఖానాపురం, నల్లబెల్లి మండలాల్లో ఎన్నికలు జరిగాయి. ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్.. మధ్యాహ్నం నుంచి ఓటర్లు గుంపులు గుంపులుగా రావడం కనిపించింది. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లాలోని నడికూడ మండలం నర్సక్కపల్లి గ్రామంలో మాజీ స్పీకర్ సిరికొండ మధుసుదనాచారి, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్‌రావు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఆయన స్వగ్రామమైన నడికూడ మండలం వరికోలు గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక శాయంపేట మండలంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన సతీమణి గండ్ర జ్యోతి తమ ఓటు హక్కును వినియోగించుకోగా నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆయన సతీమణి స్వప్నతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రశాంతంగా ఎన్నికలు జరగడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.

823
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles